: సల్మాన్ ఖాన్ నరహంతక అభియోగాలు ఎదుర్కోవాల్సిందే: సెషన్స్ కోర్టు


దశాబ్దం కిందటి కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2002 లో పీకల్దాకా తాగి రోడ్డుమీద నిద్రిస్తున్న వారిపైకి కారు ఎక్కించి ఒకరి మరణానికి కారణమైన సల్మాన్ పై క్రింది కోర్టు మోపిన నరహంతక అపరాధం అభియోగాన్ని ఎదుర్కోవాల్సిందేనని ముంబై సెషన్స్ జడ్జి యూబీ హిజీబ్ స్పష్టం చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సల్మాన్ దాఖలు చేసిన పిటీషన్ నూ కోర్టు తోసిపుచ్చింది.

కాగా ఈ అభియోగం కింద సల్మాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. గతంలో ఈ కేసులో మెజిస్ట్రేట్ కోర్టులో తక్కువ తీవ్రత గల అభియోగాలు నమోదయ్యాయి. అనంతరం బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 17 మంది సాక్షులను విచారించి సల్మాన్ ఖాన్ పై నరహంతక అపరాధం అభియోగం మోపింది. పునర్విచారణ కోరుతూ సెషన్స్ కోర్టుకు కేసును బదిలీ చేసింది.

ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో సల్మాన్ తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని, అతనిపై నరహంతక అపరాధం అభియోగాలు సరైనవేనని ప్రభుత్వ న్యాయవాది శంకర్ ఇరడే పేర్కొన్నారు. ఘటన జరిగినప్పుడు అంగరక్షకుడు వారిస్తున్నా వినకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తిని చంపేశాడని పేర్కొన్నారు. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News