: సీబీఐ కి స్వయం ప్రతిపత్తి: సిబాల్
వివిధ రంగాలకు చెందిన మేధావులే కాకుండా, అత్యున్నత న్యాయస్థానం సైతం పలు కేసులలో మొట్టికాయలు వేయడంతో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సీబీఐ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండబోదని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. సీబీఐకి స్వయం పత్రిపత్తి అనే అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశమై సీరియస్ గా చర్చించింది. అనంతరం సిబాల్ విలేకరులతో మాట్లాడుతూ రాజ్యంగబద్దమైన సంస్థల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.