: బాబును విమర్శించే అర్హత వాళ్లకు లేదు: నన్నపనేని
చార్ ధామ్ యాత్ర బాధితులైన తెలుగు ప్రజలను ఆదుకోవడంలో విఫలమైన రాష్ట్రప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రుల చేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయిస్తోందని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆమె మాట్లాడుతూ, 4000 మంది ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నారని ప్రసారమాధ్యమాలు చెప్పేవరకు సమాచారం తెలుసుకోలేని దుస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని విమర్శించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన బాబు యాత్రనుంచి రాగానే యాత్రీకులను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లారని గుర్తుచేశారు. బాబుపై విమర్శలు మాని, యాత్రీకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నన్నపనేని డిమాండ్ చేశారు.