: బీహార్ లో గ్రామస్థులపై పోలీసు కాల్పులు
బీహార్ లో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ రేగింది. గ్రామస్థులు దాడికి దిగితే పోలీసులు కాల్పులకు దిగారు. హోరాహోరీగా జరిగిన పోరాటంలో డీఎస్పీ సహా 25 మంది పోలీసులకు గాయాలైతే ఐదుగురు గ్రామస్ధులు అశువులుబాసారు. చంపారణ్ జిల్లా బాఘా గ్రామంలో హత్యకేసులో విచారణకు వెళ్లిన పోలీసులకు, గ్రామస్థులు ఎదురుతిరిగి దాడికి తెగబడ్డారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు గాయపడగా, ఐదుగురు మృతి చెందారు.