: లోహ విహంగాలకు వర్షం అడ్డంకి.. అధైర్యపడొద్దంటున్న వైమానిక దళం
ఉత్తరాఖండ్ లో వర్షం మళ్లీ జోరందుకుంటోంది. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇప్పటికీ వేలాది మంది కొండకోనల్లోనే చిక్కుకుపోయారు. దీంతో బాధితుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరికీ వైమానిక దళం మేమున్నామంటూ భరోసా ఇస్తోంది. ఉత్తరాఖండ్ వర్షాలను సవాలుగా తీసుకున్న సైన్యం, బాధితులను రక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. వైమానిక దళానికి ఇదే అతిపెద్ద హెలీకాప్టర్ ఆధారిత ఆపరేషన్. కాగా, ఈ రోజు ఉదయం నుంచి 430 మంది యాత్రీకులను హెలీకాప్టర్లు రక్షించాయి. వాతావరణం అనుకూలించక 52 లోహవిహంగాలు సహాయక చర్యల్లో పాల్గోలేకపోయాయి.