: ప్యాకేజీ వెనుక కేసీఆర్ : టీడీపీ నేత పెద్దిరెడ్డి
తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయం వెనుక కేసీఆర్ హస్తముందని టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి ఆరోపించారు. నేడు హైదరాబాద్ లోని టీడీపీ భవన్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తో సంప్రదించాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందన్నారు. తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి రాహుల్ ను ప్రధానిని చేసేందుకు తోడ్పడాలంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందమని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ అసలు రంగును ప్రజలు గమనిస్తారని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.