: వన్నె తగ్గని టీమిండియా సత్తా.. చాంపియన్ ట్రోఫీ కైవసం
టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. ఇంగ్లండ్ గడ్డపై ఆ దేశపు జట్టును మట్టికరిపించి చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ ను 20 ఓవర్లకు కుదించారు. దాంతో అది టి20 మ్యాచ్ గా మారిపోయింది. తొలుత బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ భారత జట్టును 129 పరుగులకు కట్టడి చేసింది. భారత్ 7 వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టును భారత్ 124 పరుగులు దాటనీయలేదు. దీంతో విజయం భారత వశమైంది. భారత జట్టులో కోహ్లీ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జడేజా 25 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అలాగే 2 వికెట్లు తీసుకుని భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. జడేజా, కోహ్లీ భాగస్వామ్యమే భారత్ ను ట్రోఫీ విజేతగా నిలబెట్టింది. అశ్విన్, ఇషాంత్ చెరో రెండు వికెట్లు తీసుకుని జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.