: అకాల వర్షాల మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు


అకాల వర్షాల కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద ఈ వర్షాల బారిన పడి మొత్తం 18 మంది చనిపోయారని మంత్రి వెల్లడించారు.ఇక పంట నష్టపోయిన వారి వివరాలు వారం రోజుల్లోగా అందజేయాలనీ, ఇళ్లు దెబ్బతిన్న వారికి కూడా పరిహారం ఇవ్వాలనీ ఆయన అధికారులను ఆదేశించారు.

ఎన్నికల కోడ్ కారణంగా కేవలం మూడు జిల్లాల్లోనే ముఖ్యమంత్రి పర్యటించి బాధితులను పరామర్శిస్తారని మంత్రి తెలిపారు. రెండ్రోజుల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలపై సమీక్షించేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అధికారులతో జరిగిన సమావేశంలో రఘవీరా కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అకాల వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News