: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు


రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అలాగే వాయువ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీవర్షాలు కూడా పడవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News