: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నల్లధనం?


కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో, మీడియాలో ప్రచార ప్రభావమో తెలియదుగానీ, స్విస్ బ్యాంకులలో భారతీయుల నల్లధనం తగ్గుముఖం పట్టింది. స్విస్ బ్యాంకుల్లో దాగున్న సంపద జాబితాను చూస్తే భారత్ 70వ స్థానంలో ఉంది. అక్కడి బ్యాంకుల్లో భారతీయులకు 2012 చివరి నాటికి 9,000కోట్ల రూపాయల ధనమే ఉందని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. అత్యధికంగా బ్రిటన్ వాసుల నల్లధనం స్విస్ బ్యాంకుల్లో పోగుపడింది. బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. అయితే, భారతీయ నల్లకుబేరులు విదేశాలలో దాచుకున్న అవినీతి సొమ్ము 72లక్షల కోట్ల రూపాయలు ఉంటుందనే అంచనాలు గతంలో వెలువడ్డాయి. వాస్తవానికి భారత్ నుంచి ఎక్కువ సంపద తరలేది స్విస్ బ్యాంకులకే. మరి భారతీయుల సొమ్ము కేవలం 9,000కోట్ల రూపాయలే ఉందని చెప్పడం ద్వారా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు పలు సందేహాలను లేవనెత్తింది. ఈ గణాంకాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News