: మరోసారి మావోయిస్టుల దాడి
ఛత్తీస్ గఢ్ లో మరోసారి మావోయిస్టులు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. నారాయణ్ పూర్ జిల్లా, దౌడాయి అటవీ ప్రాంతంలో తమకు ఎదురుపడ్డ పోలీసులపై మావోయిస్టులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పోలీసులను నారాయణ్ పూర్ ఆస్పత్రికి తరలించారు.