: సగం మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలకు పనికిరానివారే


అవడానికి గ్రాడ్యుయేట్లే. యూనివర్సిటీల నుంచి పట్టాలు పుచ్చుకున్నవారే. కానీ, పొట్టకోస్తే ఒక్క ఇంగ్లిష్ అక్షరం ముక్క కూడా రాదు. మరో సిగ్గు చేటైన విషయం ఏమిటంటే, కంప్యూటర్ గురించి కూడా సరిగా తెలియకపోవడం. ఈ కారణంగానే ఏటా 50లక్షల మంది గ్రాడ్యుయేట్లు విద్యా సంస్థల నుంచి బయటకు వస్తుంటే సగం మంది కూడా ఉద్యోగాలు పొందలేకున్నారని జాతీయ ఉద్యోగ సమచార నివేదిక వెల్లడించింది. దీన్ని ఒక ప్రైవేటు సంస్థ రూపొందించింది. దాదాపు 60 వేల మంది గ్రాడ్యుయేట్లను ఇంగ్లిష్, కంప్యూటర్ స్కిల్స్, అనలైటికల్, కాగ్నిటివ్ స్కిల్స్ అంశాలలో పరీక్షించగా ఈ విషయం బయటపడింది. పురుషులతో పోలిస్తే పలు అంశాలలో వెనుకబడి ఉన్నప్పటికీ ఉద్యోగాలు దక్కించుకోవడంలో మహిళా గ్రాడ్యుయేట్లే ముందున్నారట.

కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమయ్యే సేల్స్, కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలలో కేవలం 15 శాతం మందే ఉద్యోగాలు సంపాదించగలిగారు. 36 శాతం మంది క్లరికల్ ఉద్యోగాలను సంపాదించుకున్నారు. ఇంగ్లిష్ నైపుణ్యం అవసరమయ్యే కార్పొరేట్ కమ్యూనికేషన్ ఉద్యోగాలలో 2 శాతం మందికే ఉపాధి దక్కిందని నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News