: కేదార్ నాథ్ కొండల్లో 500 మృత దేహాలు


ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్ నాథుడు కూడా ఒకరు. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రం పరిసరాలు ఇప్పుడు మరుభూమిని తలపిస్తున్నాయి. పరిసర కొండల్లో, లోయల్లో 500 వరకూ మృతదేహాలు పడి ఉన్నాయని సమాచారం. విషాదకరమైన విషయమేమిటంటే, ఇవన్నీ చేరుకోవడానికి వీలు లేని మారుమూల ప్రాంతాలు. వరదలు వచ్చినప్పుడు వీరు చెల్లా చెదురై ఆనక ఆహారం, నీరు దొరకక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఎక్కువ శాతం మృత దేహాలు జంగిల్ చెట్టి, రంబాడలో పడి ఉన్నాయంటున్నారు. తరుముకొస్తున్న వరద ముప్పు నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వీరు కొండల్లో, అడువుల్లోకి పరుగులు తీసి ఉంటారని భావిస్తున్నారు.

మొత్తం మీద 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వీరిని చేరుకుని కాపాడడం సులభ సాధ్యం కాదని వాదన. వాస్తవానికి ఇలా మారుమూలు కొండ, లోయ ప్రాంతాల నుంచి సహాయక దళాలు ఇప్పటి వరకూ 700 మందిని ప్రాణాలతో కాపాడాయి. ఎన్ని వేల పాకెట్లు విడిచినా.. తామున్న ప్రాంతాలలో ఒక్క పాకెట్ కూడా పడలేదని వారు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆహారం అందకే 500 మందీ ప్రాణం విడిచి ఉంటారని భావిస్తున్నారు. వీరితో కలిపితే మృతులు 1500 మందికి చేరినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News