: శభాష్.. ఆర్మీ
ఉత్తరాఖండ్ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఆర్మీపై యాత్రికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సైన్యం తమకు రెండో జీవితాన్ని ఇచ్చిందని డెహ్రాడూన్ హెలిపాడ్‌వద్ద యాత్రికులు పేర్కొన్నారు. సైన్యం లేకుంటే తమకు మరణం తప్పేది కాదన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ జవాన్లు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. మరోవైపు జోషిమఠ్ నుంచి బదరీనాథ్ మధ్య రోడ్డు రవాణా పునరుద్ధరించారు. గుప్త కాశీలో ఇంకా వేయి మంది యాత్రికులు వేచివున్నారు.