: 'మద్యం విక్రయాల ద్వారా 12వేల కోట్లు'


ఒకటి రెండు రోజుల్లో నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి పార్థసారధి చెప్పారు. నూతన పాలసీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 10వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News