: ఐపీఎస్ ఉమేష్ కుమార్ కు చుక్కెదురు
రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ విచారణ ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను నాంపల్లి సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు బదిలీ చేయాలని ఉమేష్ కుమార్ పిటిషన్ ద్వారా కోరారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ సీఐడీ కోర్టులోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది.