: బాలీవుడ్లో ధనుష్ గెలిచాడు
మరో దక్షిణాది నటుడు బాలీవుడ్లో శెభాష్ అనిపించాడు. రజనీకాంత్ అల్లుడిగా పరిచయమైనా నటనా చాతుర్యంతో జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్న తమిళ హీరో ధనుష్ తొలి బాలీవుడ్ ప్రయత్నంలో మంచి విజయం దక్కించుకున్నాడు. ధనుష్-సోనమ్ కపూర్ జంటగా బాలీవుడ్లో ఇటీవల విడుదలైన 'రాంజనా' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రేమికుడిగా ధనుష్ పండించిన పాత్రపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.