: ధావన్.. కచ్చితమైన వేటగాడు :హర్షా భోగ్లే


టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కచ్చితమైన వేటగాడు అని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభివర్ణించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచులోనూ అద్భుతంగా రాణిస్తున్న ధావన్ ను భారత క్రికెట్ ఆశాకిరణంగా భావించాడు భోగ్లే. 'శ్రీలంకతో జరిగిన మ్యాచులో కేవలం ధావన్ కే లెక్కలేనన్ని క్లిష్టమైన బంతులు పడ్డాయి. చాలా ఇబ్బంది పడ్డాడు కూడా. అయినా ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఆ సమయంలో బంతి ఏమాత్రం దిశ మారుతున్నా బౌండరీకి పంపించగలిగాడు. బంతిని అంచనా వేయడంలో గొప్ప పరిణతి చూపించాడు. ఈ విషయంలో ధావన్ కచ్చితమైన వేటగాడిగా నాకు కనిపించాడు. టీమిండియా ఆశాకిరణం' అంటూ హర్షా భోగ్లే ప్రశంసలు కురిపించాడు.

  • Loading...

More Telugu News