: రాష్ట్రానికి వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశముందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనానికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని, ఇది కూడా వాతావరణంపై ప్రభావం చూపే అవకాశముందని వారు పేర్కొన్నారు.