: కాంగ్రెస్ ను ఓడించడానికి చేతులు కలపండి: అద్వానీ పిలుపు
ఏక సిద్ధాంత పార్టీలు చేతులు కలిపి కాంగ్రెస్ ను మట్టి కరిపించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ పిలుపునిచ్చారు. జన్ సంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సంస్మరణ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన అద్వానీ ప్రసంగించారు. 'సిద్ధాంతాల సారూప్యత ఉన్న పార్టీలు చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమయింది. మంచిపని కోసం ఒక్కటై కాంగ్రెస్ పార్టీని ఓడించాలి' అంటూ అద్వానీ తెలిపారు.