: తొలి రోదసి ఉపాధ్యాయురాలు వాంగ్‌


ఎక్కడైనా ఉపాధ్యాయులు పాఠశాల నుండే విద్యార్ధులకు పాఠాలు బోధిస్తారు. కానీ వాంగ్‌ మాత్రం అంతరిక్షం నుండి పాఠాలు బోధిస్తూ తొలి రోదసి ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా రోదసి యాత్రికుల్లో రెండవ మహిళా యాత్రికురాలైన వాంగ్‌ యాపింగ్‌ ఇప్పుడు తొలి రోదసి ఉపాధ్యాయురాలిగా రికార్డు సృష్టించారు. ఇప్పటికే చైనా నుండి అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళా వ్యోమగామిగా గుర్తింపు పొందిన వాంగ్‌, ఇప్పుడు చైనా విద్యార్ధులకు అక్కడి నుండే పాఠాలు చెబుతూ తొలి అంతరిక్ష ఉపాధ్యాయురాలిగా రికార్డును తన సొంతం చేసుకున్నారు.

వైమానిక దళ పైలట్‌ అయిన వాంగ్‌ రోదసిలో భారరహిత స్థితి, న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతంపై దాని ప్రభావం అనే అంశంపై అంతరిక్షం నుండి ఉపన్యసించారు. సుమారు నలభై అయిదు నిమిషాల పాటు సాగిన వాంగ్‌ పాఠాన్ని సుమారు ఆరుకోట్ల మంది చైనా విద్యార్ధినీ విద్యార్ధులు శ్రద్ధగా, ఆసక్తిగా విన్నారు. దాదాపు 330 ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలల విద్యార్ధులు, ఉపాధ్యాయులతోపాటు లక్షలాదిమంది చైనా పౌరులు సంభ్రమాశ్చర్యాలతో ఈ పాఠాన్ని విన్నారు.

  • Loading...

More Telugu News