: వీరప్పన్ అనుచరులకు ఉరి అమలుపై సుప్రీం స్టే


వీరప్పన్ అనుచరుల ఉరిశిక్ష అమలుపై సర్వత్ర నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. ఆ నలుగురి ఉరితీత నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఈ రోజు మధ్యాహ్నం తాత్కాలిక స్టే ప్రకటించింది. ఏ క్షణంలో అయినా ఆ నలుగురు ఉరి కొయ్యకు వేలాడే అవకాశాలున్నాయన్న నేపథ్యంలో.. సుప్రీం నిర్ణయం వీరప్పన్ అనుచరుల కుటుంబాలకు నిస్పందేహంగా ఊరటనిచ్చేదే. బుధవారం వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

  • Loading...

More Telugu News