: తెలంగాణ ఉద్యమం.. పదవుల కోసమే: మంత్రి టీజీ


తెలంగాణ ఉద్యమం వచ్చింది పదవుల కోసమేనని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర విభజన సమస్యకు రెండో ఎస్సార్సీ వంటి పరిష్కార మార్గాలు ఉన్నాయని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీలు ఇవ్వడం తమకు ఆమోదనీయమే అన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే తాము సహకరిస్తామని, అలాగే తమకు కూడా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఉత్తర భారత వరదల వల్ల తెలుగువారు ఇబ్బందిపడుతున్నందు వల్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ డిమాండ్ అన్నారు.

  • Loading...

More Telugu News