: పండగ చేసుకుంటున్న ఐటీ పరిశ్రమలు
రూపాయి పతనమైపోయింది. గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్ధాయికి పడిపోయింది. రూపాయి ధాటికి దేశీయ కంపెనీలన్నీ కుదేలయిపోయే పరిస్థితి ఎదురౌతుండగా ఐటీ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. విదేశీ కంపెనీలు ఔట్ సోర్సింగ్ పేరిట మనదేశ ఐటీ పరిశ్రమలకు పనులను కేటాయించడంతో వారి చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. దీంతో రూపాయి పతనం, డాలర్ బలపడడం ఐటీ కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. రూపాయి పతనంతో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్ వంటి కంపెనీలు ఉద్యోగుల జీతాలు కూడా పెంచనున్నాయని ఉద్యోగులంటున్నారు. మరో వైపు ఆర్థిక మంత్రి రూపాయి పతనానికి దిగుమతులు పెరగడమే కారణమంటున్నారు. బంగారంపై పెట్టుబడులు తగ్గించాలని ప్రజలను ఆయన కోరుతున్నారు.