: శాసనసభలో కాగ్ నివేదిక


శాసనసభలో రాష్ట్రప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. జలయజ్ఞం, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను కాగ్ నివేదిక వెల్లడించింది. 26 ప్రాజెక్టుల అమలుకు సంబంధించి నిర్దిష్ఠ పరిశీలనను కాగ్ నివేదిక వెల్లడించింది. కృష్ణా వరద జలాలపై ఆధారపడి చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల మనుగడ కష్టమేనని పేర్కొంది.

గాలేరి-నగరి, వెలిగొండ, శ్రీశైలం, ఎడమగట్టు కాలువ విషయంలో నీటిలభ్యత రుజువు చేయలేదని, అందుకే ప్రతిపాదనలను కేంద్ర జలసంఘం తిప్పిపంపిందని తెలిపింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యంతో నిర్మాణ వ్యయం 52,116 కోట్ల మేర పెరిగిందని వివరించింది.

  • Loading...

More Telugu News