: అమర్ నాథ్ యాత్రకు పటిష్ఠ భద్రత: ఒమర్
అమర్ నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు ఉందంటూ వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ముప్పు ఏమీ పెరగలేదన్నారు. యాత్రకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అమర్ నాథ్ యాత్రీకులపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలున్నాయంటూ కేంద్ర హోం మంత్రి షిండే కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.