: మళ్లీ భూమి ఒక్కటవుతుందా...!


ఒకప్పుడు భూమి ఒకే భాగంగా ఉండేదట... భూమిలోని భౌగోళిక మార్పుల కారణంగా తర్వాత కాలంలో భూమి ఇప్పుడున్న ఖండాల రూపంగా మార్పు చెందిందట. ఇలా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టివుంటుందని శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే మళ్లీ కొంత భూభాగం ఒక్కటిగా మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భౌగోళిక మార్పుల కారణంగా ఇంకో 22 కోట్ల సంవత్సరాల తర్వాత ఐరోపా, అమెరికా ఖండాలు కలిసిపోతాయని శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనం ఫలితాలను పరిశీలించి చెబుతున్నారు.

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇలా భూమి విడిపోయిందంటూ ఖండచలన సిద్ధాంతం వివరించింది. అయితే మోనాష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇలా ఖండచలనానికి కారణమయ్యే మార్పులు ఇప్పటికే అట్లాంటా సముద్రంలో ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ జో డాటే మాట్లాడుతూ ఖండచలన ప్రక్రియలో భాగంగా ఐబీరియా సమీపంలోని భూ పొరలు ఒకదానిలో ఒకటి కలవడం (సబ్‌డక్షన్‌) గమనించినట్టు తెలిపారు. ఇలా ఖండచలనానికి కారణమయ్యే పగుళ్లు అట్లాంటిక్‌ సముద్ర గర్భంలో సైతం ఏర్పడినట్టు డాటే చెబుతున్నారు. దీని ఫలితంగా మరో 22 కోట్ల సంవత్సరాల తర్వాత ఐబీరియా అమెరికా భూభాగంలో కలిసిపోతుందని ఆయన చెబుతున్నారు.

  • Loading...

More Telugu News