: తిరుపతిలో మహిళా భక్తులను దోచుకున్న ఆటో డ్రైవర్


ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇద్దరు మహిళా భక్తులపై ఓ ఆటో డ్రైవర్ దాడిచేశాడు. నగదు, నగలు, ఏటీఎం కార్డులను దోచుకున్నాడు. శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి ఆటోలో వస్తుండగా ఇద్దరు మహిళలను డ్రైవర్ వావిలాల చెరువు సమీపంలోకి తీసుకెళ్లి దాడిచేసి దోచుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు బాధిత మహిళలు ఎం ఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా దోపిడీ
డ్రైవర్ ను పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. 

  • Loading...

More Telugu News