: లంకను బెంబేలెత్తిస్తున్న భారత బౌలర్లు
శ్రీలంకను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక బ్యాట్స్ మన్ లను భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు నిప్పులు చెరిగే బంతులతో కట్టడి చేశారు. వీరి ధాటికి 20 ఓవర్లలో శ్రీలంక కేవలం 60 పరుగులే చేయగలిగింది. 9 ఓవర్లపాటు ఏకధాటిగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ ఓవర్ కు రెండు చొప్పున కేవలం 18 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ 6 ఓవర్లు బౌలింగ్ చేసి 3 ఎకానమీతో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. వీరి స్ఫూర్తితో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేష్ యాదవ్ కూడా 3 ఎకానమీతో కేవలం 22 పరుగులిచ్చాడు. జడేజా, ధోనీ కాస్త ధారాళంగా పరుగులివ్వడంతో శ్రీలంక 30 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.