: కాలుష్యకారకులకు చైనాలో మరణదండన
వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే వ్యక్తులపై చైనా మరణశాసనం విధించనుంది. పర్యావరణ సంబంధ నియమనిబంధనలను మరింత కఠినతరం చేస్తూ చైనా ఇటీవలే నిర్ణయం తీసుకుంది. కాలుష్య కారకులకు కఠినశిక్షలు తప్పవని, మరీ తీవ్రమైన కేసుల్లో మరణదండన ఖాయమంటూ ఆ దేశ సుప్రీంకోర్టు పర్యావరణ చట్టాలకు పదును పెట్టింది. ఇందుకోసం ఒక పర్యావరణ నిఘా సంస్థను కూడా చైనా సర్కారు ఏర్పాటు చేసింది. దీని పనల్లా, పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యస్థాయిలను గుర్తించి.. ప్రజలకు హానికలిగించే కంపెనీల వివరాలను వివిధ న్యాయశాఖలకు అందించడమే!