: ఇక షారూఖ్ ను కౌగిలించుకోవడం కుదరదు!


బాలీవుడ్ లో అభిమానులను ఆప్యాయంగా పలకరించే హీరోల్లో షారూఖ్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. కరచాలనం చేయడమే కాకుండా, వారిని తన హృదయానికి హత్తుకుంటాడు. ఈ బాలీవుడ్ బాద్షాను కలిసిన అభిమానులు ఎవరైనా ఈ విషయం నిజమే అంటారు. కానీ, ఇకపై ఈ హీరోను ఎవరూ ఆలింగనం చేసుకోవడం కుదరదట. షారూఖ్ ను చూడగానే ఎవరూ ఎగిరిగంతేసి వాటేసుకోవద్దని సలహా ఇస్తున్నారు అతని వైద్యులు. ఎందుకంటే, ఇటీవలే ఈ స్టార్ హీరో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడట. దీంతో, అతన్ని ఎవరైనా ఆలింగనం చేసుకునే క్రమంలో భుజానికి ఒత్తిడి తగులుతుందని, తద్వారా గాయం మళ్ళీ తిరగబెట్టే ప్రమాదముందని వారి భయం. నిజమే కదూ!.

  • Loading...

More Telugu News