: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీపీఐ నేత
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రిని కోరారు. హైదరాబాద్ సచివాలయంలో నేడు ముఖ్యమంత్రిని కలిసిన కూనంనేని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్షలనుభవిస్తున్న ఖైదీల కాలపరిమితి తగ్గించాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. అయితే, దీనిపై మహిళా సంఘాల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో మహిళలపై దారుణాలకు ఒడిగట్టిన వారే ఎక్కువగా ఉన్నారని, అందరికీ శిక్ష తగ్గిస్తే వీరంతా రెచ్చిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.