: ఉత్తరకాశీ విపత్తులో విశాఖ వాసులు మృతి
ఉత్తరాఖండ్ వరదల్లో విశాఖ వాసులు కూడా మృతి చెందారు. ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని విశాఖ సీతమ్మధారకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు యాత్రీకులు మృతి చెందారు. దీంతో సీతమ్మధారలో విషాదం నెలకొంది. విశాఖపట్టణానికి చెందిన 15 మంది సభ్యుల బృందం ఉత్తర కాశీయాత్రకు వెళ్లింది. వీరంతా కేదార్ నాథ్ సమీపంలోని రాంపూర్ చెక్ పోస్టు వద్దకు చేరుకునేంతలో వరద ఉదృతి పెరగడంతో వీరు మృతి చెందినట్టు బంధువులకు సహయాత్రీకులు సమాచారమందించారు. మరో వైపు వరదలో చిక్కుకున్న 150 మంది తెలుగువార్ని సురక్షితంగా ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కు అధికారులు తరలించారు. అధికారులు మరింతమందిని రక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీ యాత్రకు సుమారు 3 వేల మంది తెలుగువారు వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు.