: కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా రాహుల్: కేంద్రమంత్రి నారాయణస్వామి


లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రకటించే అవకాశాలున్నాయని కేంద్రమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ.. భాజపాలో ప్రధాని అభ్యర్ధి విషయంలో మోడీ - అద్వానీ మధ్య ఇప్పటికే యుద్ధం నడుస్తోందని, సుష్మా, అరుణ్ జైట్లీ కూడా ఆ పదవిని ఆశిస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని నారాయణస్వామి అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో భాజపా ఆశలు ఫలించే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.

  • Loading...

More Telugu News