: ధన్యుణ్ణి ప్రధాని గారూ.. ధన్యుణ్ణి: నితీశ్ ఆనందం
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తనను లౌకికవాది అని కొనియాడడం పట్ల బీహార్ సీఎం నితీశ్ కుమార్ పొంగిపోతున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి నితీశ్ కృతజ్ఞతలు తెలిపారు. పాట్నాలో నేడు విలేకరులతో మాట్లాడుతూ, ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రధాని వ్యాఖ్యలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. తానెలాంటివాణ్ణో ప్రధాని మన్మోహన్ తాజా వ్యాఖ్యలతో చెప్పినట్టయిందని నితీశ్ పేర్కొన్నారు. జేడీయూ పార్టీ కొద్దిరోజుల క్రితం బీహార్లో బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.