: కసరత్తులు.. కసికసిగా..


టీమిండియా మరో వరల్డ్ టైటిల్ కైవసం చేసుకునేందుకు ఉరకలు వేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రేపు శ్రీలంకతో సెమీస్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటోంది. ఈ క్రమంలో ప్రాక్టీసులో చెమటోడ్చుతోంది. టీమిండియా ఆటగాళ్ళు టోర్నీలో తొలిసారిగా మైదానం వెలుపల కసరత్తులు చేయడం విశేషం. కార్డిఫ్ నగరంలోని గ్లామోర్గాన్ కంట్రీ క్లబ్ లో ఆటగాళ్ళు ప్రాక్టీసుతో బిజీబిజీగా గడిపారు. బ్యాట్స్ మెన్ నెట్స్ లో స్పిన్ ను ఎదుర్కొనేందుకు ఉత్సాహం చూపారు. ఎందుకంటే, లంక జట్టుకు నాణ్యమైన పేసర్లతో పాటు రంగన హెరాత్, సచిత్ర సేనానాయకే వంటి ప్రతిభావంతులైన స్పిన్నర్లున్నారు.

  • Loading...

More Telugu News