: ఖడ్గమృగాలిస్తే.. అడవిదున్నలిస్తారట!


తమిళనాడు జంతు ప్రదర్శనశాలలో ఖడ్గమృగాలు (రైనోలు) లేవని వాపోతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత. అందుకే, ఆ జంతువులు ఎక్కువగా ఉండే అసోంపై ఆమె కన్ను పడింది. ఈ క్రమంలో అసోం సీఎంకు జయ లేఖ రాశారు. తమకు రెండు ఖడ్గమృగాలను ఇవ్వాలని అర్థించారు. అయితే, ఊరికినేంకాదట. వారు రైనోలనిస్తే అందుకు బదులుగా తాము అడవిదున్నలను ఇస్తామని అంటున్నారు. జూ అథారటీ ఆఫ్ తమిళనాడుకు అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్న జయ ఈ విషయమై మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద జంతుప్రదర్శనశాలగా పేరుగాంచిన వాండలూర్ అన్నా జూపార్కులో పాతికేళ్ళుగా ఖడ్గమృగం లేకపోవడం తీరనిలోటు అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News