: ఏటీఎం లూటీ చేయలేదు.. ఏకంగా ఎత్తుకుపోయారు!


ఏటీఎమ్ ను బద్దలుకొట్టి అందులోని డబ్బులు తీసుకెళ్లిన దొంగలను మాత్రమే ఇంతవరకు మనం చూశాం. కానీ బెంగళూరు దొంగలు తెలివిమీరిపోయారు. బద్దలుగొట్టేసరికి సమయం పడుతుంది.. కొంత డబ్బు వస్తుంది.. మరి కొంత మిస్సవొచ్చు.. హాయిగా ఏటీఎం నే ఇంటికి తీసుకెళ్లిపోతే ఏ గొడవా ఉండదు కదా అనుకున్నారా దొంగలు. అందుకే 15 లక్షల రూపాయలతో నిండి ఉన్న ఏటీఎమ్ మిషన్ ను ఊడపీకి ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి పూట గస్తీ తిరుగుతున్న పోలీసులకు బ్యాంకు ఆవరణలో ఉండాల్సిన ఏటీఎం కనబడకపోయేసరికి వెంటనే బ్యాంకు మేనేజరును సంప్రదించారు. అంతవరకు గమనించని మేనేజరు అవాక్కై లెక్కలు చూసి దాదాపు 15 లక్షల రూపాయల నగదు ఆ ఏటీఎంలో ఉందని పోలీసులకు తెలిపాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మిషన్ సరిగా బిగించకపోవడం వల్లే దొంగలు సునాయాసంగా ఎత్తుకెళ్లగలిగారని అంటున్నారు. వీడీయోలను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News