: అయ్యో పాపం... చందమామ!


చందమామ మనకు చూసేందుకు చల్లగా... తెల్లగా కనిపిస్తుంటాడు కదా... కానీ ఆయనపైనంతా ఒకటే బిలాలట. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. చల్లగా కనిపించే చందమామ పైనంతా గుంటలు, గోతులేనట. అయితే ఇవి ఎవరైనా తవ్వినవి కాదులెండి. ఇందులో ఎక్కువ భాగం అంతరిక్ష శిలలు చంద్రుణ్ని ఢీకొనడం వల్ల ఏర్పడినవేనట. అయితే గతంలో ఎన్నడూ చంద్రుడిపై బిలాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించలేదు.

ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి అవతలివైపు రెండు బేసిన్‌లను గుర్తించడానికి ఒక పరిశోధన చేపట్టారు. అయితే అది ఇలా చంద్రుడి మొత్తానికీ విస్తరించింది. చివరికి చంద్రుడి ఉపరితలంపై ఉన్న బిలాలను గుర్తించేందుకు ఉపకరించింది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలంపై సుమారు 280 కొత్త బిలాలను కనుగొన్నారు. గతంలో ఎన్నడూ వీటిని శాస్త్రవేత్తలు గుర్తించలేదు.

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి, ఉపరితల డేటాకు సంబంధించిన కంప్యూటర్‌ నమూనాల ఆధారంగా చంద్రుడిపై ఇంత పెద్ద సంఖ్యలో బిలాలు ఉన్నట్టు తాము కనుగొన్నామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న విల్‌ ఫెదర్‌స్టోన్‌ తెలిపారు. అయితే ఈ బిలాల్లో 66 బిలాలు గురుత్వాకర్షణ శక్తి, ఉపరితల అంశాలపరంగా భిన్నంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి ఉపరితలం మొత్తం ఇలాంటి బిలాలతో నిండి ఉంటుంది. అయితే ఈ బిలాలు చాలా వరకూ అంతరిక్ష శిలలు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయి. తాము కనుగొన్న ఈ సమాచారం ఆధారంగా చంద్రుడికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలవుతుందని, చందమామ చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను వెలుగులోకి తెస్తామని ఫెదర్‌స్టోన్‌ తెలిపారు.

  • Loading...

More Telugu News