: ఇక మతిమరుపు గురించి మరిచిపోవచ్చు!


మతిమరుపు వ్యాధి... అల్జీమర్స్‌... ఈ వ్యాధి సోకితే అసలు ఏమీ గుర్తుండదు. చివరికి తమ కన్నవారినైనా, తమ కడుపున పుట్టిన పిల్లలనైనా కూడా ఎవరినీ గుర్తించరు. ఇలాంటి భయంకరమైన వ్యాధిని కూడా నివారించేందుకు, అల్జీమర్స్‌ వ్యాధినుండి బయటపడేందుకు మందులను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

సాన్‌ఫోర్డ్‌-బర్న్‌హామ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు అల్జీమర్స్‌ వ్యాధినుండి బయటపడేందుకు మందులను తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. వీరు నిట్రో మెమెంటైన్‌ అనే మందును తయారు చేశారు. ఈ మందు మెదడులోని న్యూరాన్ల వ్యవస్థను దృఢపరచి, వాటి పనితీరును మెరుగుపరుస్తుందట. దీని ఫలితంగా మెదడులోని జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. నిజానికి అల్జీమర్స్‌ వ్యాధిని నివారించేందుకు మందులను తయారు చేసేందుకు సుమారు దశాబ్ద కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చివరికి ఇప్పటికి దీనిపై విజయం సాధించారు. ఈ మందు అందుబాటులోకి వస్తే... నిజంగా ఇది అల్జీమర్స్‌ రోగుల పాలిట వరంగా చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News