: తొలి సెమీఫైనల్ కు రిఫరీ మనోడే..


చాంపియన్స్ ట్రోఫీలో రేపు జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు భారత పేస్ దిగ్గజం జవగల్ శ్రీనాథ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ సెమీస్ సమరంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టకర్ అంపైర్లుగా ఎంపికయ్యారు. కాగా, టోర్నీ మొదటి సెమీఫైనల్లో తలపడుతున్న ఇంగ్లండ్.. గ్రూప్-ఎలో అగ్రస్థానం దక్కించుకోగా, సఫారీ జట్టు గ్రూప్-బిలో రెండోస్థానంలో నిలిచింది. ఇదిలావుంటే, గ్రూప్-బిలో భారత్ కు టాప్ పొజిషన్ దక్కిన నేపథ్యంలో రెండో సెమీస్ లో ధోనీ సేన.. శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఎల్లుండి కార్డిఫ్ వేదికగా జరగనుంది.

  • Loading...

More Telugu News