: 'సిరీస్' రాజుకు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు


స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ గోకరాజు సుబ్బరాజు నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సిరీస్ రాజుగా సుపరిచితుడైన ఈ తొలితరం ఫార్మా రంగ నిపుణుడికి నేడు విజయవాడ నగర కాంగ్రెస్ ఘనంగా నివాళి అర్పించింది. నేడు అంత్యక్రియల సందర్భంగా ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని కొద్ది నిమిషాల పాటు నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఉంచారు. ఈ సందర్బంగా ఎంపీ లగడపాటి రాజగోపాల్, కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, విజయవాడ కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం తదితరులు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News