: పాపం చెప్పుకునేందుకు ఫోన్‌ అప్లికేషన్‌!


చేసిన పాపం చెబితే పోతుందంటారు... అయితే ఇది ఎంతవరకూ నిజం అనేది పక్కనపెడితే... తాము చేసిన పాపాలను దేవుడికి విన్నవించుకునేందుకు తగు సమయం ఎప్పుడు అనేది తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రత్యేక మార్గాలు కూడా వచ్చేస్తున్నాయి. క్రైస్తవుల్లో సాధారణంగా పాపాలు చేసిన వారు చర్చిలకు వెళ్లి, అక్కడి కన్ఫెషన్‌ బాక్స్‌లో నిలుచుని మతాధికారుల ఎదుట తాము చేసిన పాపాలను చెప్పుకొని ఉపశమనం పొందడం మామూలుగా జరుగుతుంటుంది. అయితే తాము చేసిన పాపాలను దేవుడి ఎదుట చెప్పుకుని ఉపశమనం పొందేందుకు వచ్చిన వారికి మతాధికారి లేకపోతే పాపం నిరాశగా వెనుదిరగాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఇప్పుడు ఒక స్మార్ట్‌ ఫోన్‌ను పాపులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

చేసిన పాపాలను చెప్పుకునేందుకు 'మై కన్ఫెషన్‌ యాప్' అనే పేరుతో ఒక స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా తమ పాపాలను వినేందుకు మతాధికారి చర్చిలో ఎప్పుడు అందుబాటులో ఉంటారు? అనే విషయం తెలుసుకునేందుకు వీలవుతుంది. దీంతో చక్కగా మతాధికారి ఉన్న సమయంలోనే వెళ్లి తమ పాపాలను చెప్పుకుని ఉపశమనం పొందవచ్చట. మతాధికారి అందుబాటులో ఉంటే ఈ యాప్ లోని స్టేటస్‌ బాక్స్‌ ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఒకవేళ మతాధికారి అందుబాటులో లేకుంటే అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ యాప్ ను అమెరికాలోని విస్కాన్సిన్‌లోని మాడిసన్‌కు చెందిన చర్చి ఫాదర్‌ రిచర్డ్‌ హీల్మన్‌ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News