: గాల్లో తేలినట్టుందే ....!
స్కై డైవింగ్ అనుభవం కోసం ఎత్తయిన గాలి సొరంగాన్ని దుబాయ్‌లో ప్రారంభించనున్నారు. ఈ టన్నెల్ 20 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విండ్ టన్నెల్‌గా గుర్తింపబడింది. ఇప్పటి వరకూ అమెరికాలోని 15.8 మీటర్ల పొడవుండే టన్నెల్, సింగపూర్‌లోని 17.2 మీటర్ల పొడవుండే విండ్ టన్నెల్ ఎత్తైన టన్నెల్స్ గా గుర్తించబడేవి. అయితే దుబాయ్‌లోని ఈ విండ్ టన్నెల్ ఇరవై మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విండ్ టన్నెల్‌గా గుర్తింపు పొందింది. ఈ టన్నెల్లోకి చక్కటి గాలి రావడానికి నాలుగు హై పవర్డ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారట, పైనుండి 115 కిలోల బరువు కిందికి పడినా కూడా వాల్-టు-వాల్ గాలి ప్రవాహం బాగుండేందుకు తగిన ఏర్పాట్లు చేశారట. ఈ టవర్ నాలుగు అంతస్తుల భవనంతో రూపొందుతోంది. గ్లాస్ టవర్నుండి కిందికి దిగేవారికి చక్కగా స్కై డైవింగ్ చేసిన అనుభూతి కలిగేలా దీన్ని రూపొందిస్తున్నారట.