: మహేల వన్ మ్యాన్ షో
చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే గెలవకతప్పని మ్యాచ్ లో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆస్టేలియా జట్టుతో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 253 పరుగులు చేసింది. కంగారూ బౌలర్ల ధాటికి కుదుపులకు లోనైన లంక జట్టును మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే (81 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు) ఆదుకున్నాడు. ఐదోస్థానంలో బరిలో దిగిన మహేల.. అటు టాపార్డర్లో తిరిమన్నే (57) తోనూ.. లోయరార్డర్లో వికెట్ కీపర్ చాందిమల్ (31)తోనూ విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కాగా, ఆసీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ జాన్సన్ కు 3 వికెట్లు దక్కాయి.