: మన్మోహన్ క్యాబినెట్లో ఎనిమిది కొత్త ముఖాలు


క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 8 కొత్త ముఖాలకు మన్మోహన్ మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వారిలో మన రాష్ట్రానికి చెందిన సీనియర్లు కావూరి సాంబశివరావు, జేడీ శీలం ఉన్నారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రులుగా కావూరి సాంబశివరావు(కేబినేట్), జేడీ శీలం( సహాయమంత్రి), శీష్ రాం ఓలా, ఆస్కార్ ఫెర్నాండెజ్, గిరిజా వ్యాస్, మాణిక్ రావు గవిట్, సుదర్శన్ నాచియప్పన్, సంతోష్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విస్తరణతో మన్మోహన్ క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 75కి చేరింది.

  • Loading...

More Telugu News