: ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు: వెంకయ్య
నరేంద్రమోడీకి కీలకసమయంలో మరో ప్రముఖ నాయకుడి అండ లభించింది. నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నాయకుడే కాకుండా గొప్ప కార్యకర్త కూడా మోడీయేనని వెంకయ్య ప్రశంసించారు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి కలగాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.