: శత్రు దుర్భేద్యం మన 'బ్రహ్మోస్'


భారత్ అమ్ములపొదిలోని భీకర అస్త్రం 'బ్రహ్మోస్' మిస్సైల్ కు వచ్చే 20 ఏళ్ళలో ఎదురేలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త శివథాను పిళ్ళై. ప్రపంచంలో ఏకైక సూపర్ సోనిక్ మిస్సైల్ అయిన బ్రహ్మోస్ ను నిరోధించగలిగే (ఇంటర్ సెప్టర్) క్షిపణి ఇప్పటికైతే లేదని ఆయన స్పష్టం చేశారు. పిళ్ళై నేడు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఈ క్షిపణికి సరితూగే మిస్సైల్ ఇంతవరకు ఎవరూ రూపకల్పన చేయలేదని వివరించారు.

కాగా, పిళ్ళై బ్రహ్మోస్ ఏరోస్పేస్ సెంటర్ కు సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్నారు. పిళ్ళైను బ్రహ్మోస్ ప్రాజెక్టు పిత (ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్) గా పేర్కొంటారు. ఈ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్, రష్యా దేశాలు సంయుక్తంగా రూపొందించాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్లోని తొలి రెండు అక్షరాలను సూచించే విధంగా ఈ అస్త్రానికి 'బ్రహ్మోస్' అని నామకరణం చేశారు.

  • Loading...

More Telugu News