: అగస్టా అవకతవకలపై సమగ్ర నివేదిక కోరిన విజిలెన్స్ కమిషన్
అగస్టా కుంభకోణంలో కీలకమైన హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకతలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రక్షణశాఖను కేంద్ర విజిలెన్స్ కమిషన్ కోరింది. ఈ కుంభకోణంలో తలెత్తిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించడానికి, అలాగే చర్యలు తీసుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనుంది. అవినీతి ఆరోపణలపై దాఖలైన ఫిర్యాదును కమిషన్ రక్షణ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసరుకు అందించారు. మరోవైపు హెలికాఫ్టర్ల కుంభకోణంపై ప్రత్యక్ష విచారణ చేపట్టాలని కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్ భావిస్తోందని తెలుస్తోంది.