: భారత్ అంటే మాకేం భయం: ఇంగ్లండ్ కెప్టెన్


చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ ఎదురైనా భయపడబోమని ఇంగ్లండ్ సారథి ఆలిస్టర్ కుక్ గాంభీర్యం ప్రదర్శించాడు. కార్డిఫ్ లో నిన్న కివీస్ తో మ్యాచ్ లో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫైనల్ ముంగిట ఏ జట్టునైనా దీటుగా ఎదుర్కొంటామని కుక్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ చూపంతా సెమీస్ పైనే అని స్పష్టం చేశాడు.

కాగా.. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో శ్రీలంక భారీ విజయం సాధిస్తే, శ్రీలంక మెరుగైన రన్ రేట్ తో అగ్రస్థానం చేజిక్కించుకుంటుంది. అప్పుడు ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంటుంది. తద్వారా సెమీస్ లో భారత్ తో తలపడాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఓ గ్రూప్ లో టాప్ లో ఉన్న జట్టు అవతలి గ్రూప్ లో రెండోస్థానంలో నిలిచిన జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. గ్రూప్-బిలో ఉన్న ధోనీ సేన ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయభేరి మోగించి టాపర్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ఇక, తమ ఫైనల్ అవకాశాలపై కుక్ మాట్లాడుతూ, సెమీస్ పైనే తమ దృష్టి అని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News